Shiva




సినిమా  స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే నాలెడ్జి కి సంబంధించిన వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి.....

Shiva :

తెలుగు సినిమా కి కొత్తదనాన్ని, ఆలోచనలను అందించినవాడు వర్మ ...

మూస కధల్ని, మూస ఫార్ములాల్ని బ్రేక్ చేసిన వాడు వర్మ ...
 
Assistant directors ..Associate directors..కొంతమంది డైరెక్టర్స్ అయిన వారికి .. రాబోయే తరం వారికి ... కూడా ప్రేరణ గా నిలిచినా తెలుగు డైరెక్టర్ ...

టెక్నాలజీ ని ముందు గా అంది పుచ్చుకుని నిన్న "స్టడీ కామ్" ని ... నేడు "5 డి" ని వాడి సినిమాలు తీయవచ్చు అని గట్టిగా చెప్పిన వాడు ...

ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ను "శివ" కి ముందు / "శివ" కి తర్వాత .. అని విడదీసి ఒక చెదరని గీత గీసిన వాడు వర్మ ...




Main points :
1.శివ లో మొత్తం 20 + 55 +25 = 100 సీన్స్ వున్నాయి ..(Act-1,Act-2,Act-3)
ప్లాట్ పాయింట్ 1 లొకి వెళ్ళే లోపు 20 సీన్ లు జరుగుతాయి ...
ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ శివ ... అతని రిలేటెడ్ క్యారెక్టర్ లు .. అన్న, వదిన, పాప ... కాలేజీ ఫ్రెండ్స్ ... బ్యాక్ డ్రాప్ జరిగే ప్లేస్ ... నెగటివ్ క్యారెక్టర్ లు అన్నీ పరిచయం అవుతూనే ... ప్లాట్ పాయింట్ 1 కి దారి తీసే పరిస్తితులు కల్పిస్తారు ....

ప్లాట్ పాయింట్ 1 : సైకిల్ చైన్ ఫైట్  తో స్టార్ట్ అవుతుంది . స్క్రిప్ట్ పరుగులు పెడుతుంది ... ఇక్కడ నుండి 55 సీన్ లు జరుగుతాయి ...

శివ, ఫ్రెండ్స్ కి - భవాని మనుషులకు ..Action –Reaction  సీన్ లు జరుగుతాయి ..

 
ప్లాట్ పాయింట్ 2  :శివ - భవాని కి ఎదురు తిరగడం . అధికారాన్ని చేతిలోకి తీసుకోవడం .
చిన్నా ద్వారా గణేష్ బార్ లో దొరకడం తో కధ మలుపు తిరుగుతుంది ..
ఇక్కడ నుండి 20 సీన్ లు వుంటాయి ...

 2. స్క్రిప్ట్ లో అల్లిన క్యారెక్టర్ లు .. ఫస్ట్ హాఫ్ జరిగిన ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొత్తగా రాసుకుంటూనే ... కధ ఒక పద్దతిగా ఒక బౌండరీ లైన్ లో జరిగేల చూసుకోవాలి .. అప్పుడే కధ కు దిశా నిర్దేశం వున్నట్టు .. ఒక గాడిలో వుంటుంది ...
ఫస్ట్ హాఫ్ లో వదిలేసిన "గణేష్" అనే క్యారెక్టర్ - బార్ లో దొరకడం తో కధ మళ్ళీ పద్దతిగా మలుపులు తిరుగుతుంది ... గణేష్ - భవాని గురించి అన్నీ నిజాలు చెప్పస్తానని అనడం .. భవాని చిక్కుల్లో పడడం ... కోర్ట్ కి గణేష్ ని తీసుకెళ్లడం .. చేసేదేమీ లేక భవాని "పాప "ని కిడ్నాప్ తర్వాత చంపడం .... చివరిగా శివ కోపం తో భవాని ని చంపడం ... ఇలా ఫస్ట్ హాఫ్ లో వేసుకున్న క్యారెక్టర్ ద్వార నే కధ జరిగింది ... ఇదే కాదు మంచి హిట్ సినిమాలు చుస్తే అదే కనపడుతుంది ...

3. "శివ" స్క్రిప్ట్ లో మాటలు తక్కువ .. ఆక్షన్ ఎక్కువ ... వర్మ బ్రాండ్ అది .. అతను అలాగే అతని మార్క్ కొనసాగించాడు ...


Hero  character Graph : 


హీరో క్యారెక్టర్ గ్రాఫ్ మెల్లగా పెరుగుతూ .. సెకండ్ హాఫ్ కెళ్ళే కొద్దీ భవానీ క్యారెక్టర్ నే కబలించి ... సిటీ మొత్తాన్ని చేతిలోకి తీసుకుంటాడు ... ప్రీ క్లైమాక్స్ దగ్గర పాప మరణం తో హీరో శివ కాస్త జీరో అవుతాడు, .... భవాని ని చివర్లో శివ చంపడం తో శివ మళ్ళీ హీరో అవుతాడు ..

Assets :

సినిమాని స్క్రిప్ట్ రూపం లో రాసుకోవడం .. ఒక ఎత్తు అయితే దాన్ని సినిమాగా మార్చడం ఒక ఎత్తు ... మూడ్ .. ఫీల్ ప్రతీ సీన్ లో కలగ చేస్తున్నామా? అదే విధానం సినిమా అంతా ఉందా లేదా .. ఇవన్నీ "శివ" లో కనపడతాయి ...
ఒక టెన్షన్ తో ఒక Curiosity తో సినిమా ని చూస్తాము ...

నాచురల్ గా Acting  చేయించి .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం గా ఇళయరాజా చేత కొట్టించి .. సౌండ్ ఎఫెక్ట్స్ కొత్తగా పరిచయం చేసారు .ఇవన్నీ కలిసి "శివ" సినిమా గొప్ప సినిమా గా మారడానికి దోహదం చేసాయి

స్టడీ కాం సీన్ లు :

నరేష్ ఫై ఎటాక్ ... శుభలేఖ సుధాకర్ ని చంపే సీన్ ... నాగార్జున పాప మీద ఎటాక్ ... ఇవన్నీ ప్రేక్షకుడి Involvement పెంచే సీన్ లే ...

Songs :

పాటలు అన్నీ అల్ టైం హిట్స్ ..
 

1. బోటనీ పాటముంది ..
2.
సరసాలు చాలు
3.
ఆనందో బ్రహ్మ
4.
రాంగ్ నెంబర్
5.
ఎన్నియల్లో
 

Creative thoughts :

శివ (శివుడు) ...భవాని (అమ్మవారు) .. వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు ... శివుడు "గణేష్" ని తల నరుకుతాడు .. మళ్ళీ శివుడే "గణేష్" ని కాపాడతాడు ... క్యారెక్టర్ లకు పేర్లు పెట్టడం వెనుక కుడా అర్ధాలుంటాయి ...

Creative clue:

రామ్ గోపాల్ వర్మ "శివ" సినిమా రాసేటప్పుడు కొన్ని సీన్స్, ప్లాట్ లైన్ కోసం కొన్ని సినిమాల్లోంచి తీసుకున్నారు ... (అవి ఆయన చెబితేనే మనకు తెలుస్తుంది ... లేకపోతే ఆయన తో జర్నీ చేసిన వారికి తెలుస్తుంది .. కానీ పలానా సినిమాలోంచి తెసుకున్నాను అని చెప్పగలిగే దమ్ము ఎవరికి వుంది? .. . అన్ని సినిమాల్లోంచి తీసినా కదా కొత్తగా వుందా? లేదా? అనేదే ముఖ్యం)

Rahul rawail’s “Arjun “ (Cycle chain scene )
Govind Nihlani “Artha Satya “
Dilip Shankar “KalaChakra “
Spiel berg “Jaws “
story line – Return of the dragon (Brucelee picture )
ఇవన్నీ "నా ఇష్టం" అనే బుక్ లో ఆయనే రాసారు...

Final point : 
 


శివ బాగా హిట్ అవ్వడానికి కారణం ... స్క్రిప్ట్ ఫాస్ట్ గా ఉండటమే దానికి కారణం .... ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి ... కొత్తగా Surprise లున్నాయి ... ఊహించని మలుపులున్నాయి .. ముఖ్యం గా విలన్ కి కుడా తెలివితేటలు వున్నట్టు చూపించారు ..


1 comments:

sai varma said...

e article ni naa book lo publish chesukuntanu sir ,
nenu book rastunanu rgv meda, meku ok ayte e ariticle use chesukovacha


sai prtap varma
9966134463
writer

Post a Comment