SCRIPT RULE 18




SCRIPT RULE 18 :
క్యారెక్టర్ వచ్చి ఇన్సిడెంట్ create చేస్తే .. దానికి రియాక్షన్ ఇవ్వాల్సింది కుడా హీరోనే ... అలా చేస్తేనే హీరో గ్రాఫ్ పెరుగుతుంది ... అలా రియాక్షన్స్ ఇస్తూ .. ఒకసారిగా అధికారం చేతిలోకి తీసుకోగలిగితే ... అప్పుడు గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది ...

1.     శివ: సినిమా మొదటి నుండి కధ వెళ్తున్న కొద్దీ .... నాగార్జున - రఘువరన్ తో పోటా పోటీగా వుంటూ వెళ్తూ ... ఒక్కసారిగా సిటీ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు ...

2.     అతడు: తనికెళ్ళ భరణి ... నాజర్ పొలం లో కంచె వేయిస్తాడు ... దానికి నాజర్ బ్రతిమలాడతాడు .. కానీ మహేష్ గన్ తో బెదిరించి .. ఫైట్ చేస్తాడు ...

మళ్ళీ బ్రహ్మాజీ రియాక్షన్ ఇస్తాడు .. మహేష్ తో తిరనాళ్ళలో ఫైట్ కి దిగుతాడు .. కానీ దెబ్బలు తింటాడు ..

3.     ఛత్రపతి: ప్రభాస్ అణిగి అణిగి .. ఎదురు తిరిగి... ఒక్కసారిగా అధికారాన్ని చేతులోకి తీసుకుంటాడు ... ఇంటర్వెల్ ముందే సినిమా ఒక పీక్ గ్రాఫ్ కి వెళ్ళిపోతుంది ...
 
(కానీ సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ తో డ్రైవ్ చేయడం వలన కాస్త తగ్గింది.  లేక పోతే అది బంపర్ హిట్ అయ్యేది)

4.     గబ్బర్ సింగ్: పోటా పోటీ గా జరిగిన పోరు లో హీరో సెకండ్ హాఫ్ లో ఫై చేయి గా నే వుంటాడు ... (ప్రతీ సారీ ఇలా చేయడం వలన విలన్ కి విషయం లేకుండా అయ్యింది)

5.     శివాజీ: హీరో దెబ్బలు తిని తిని .. .. ఆస్తి పోగొట్టుకుని .. ఒక్క రూపాయి చేతులో పెట్టుకుని .. తన ప్రస్థానం మొదలు పెడతాడు ... అధికారాన్ని చేతిలోకి తీసుకుంటాడు .

6.     అరుణా చలం: రజనీ కాంత్ .. మొదట అన్నీ దెబ్బలు తింటాడు ... రాజకీయం లోకి దిగ గానే - పూర్తి పట్టు సాధిస్తాడు ...

7.     యముడు: హీరో "సూర్య" ట్రాన్స్ఫర్ అయ్యాక - ప్రకాష్ రాజ్ తో ఇబ్బంది పడతాడు ... మళ్ళీ పున్జుకుంటాడు ...

8.     నరసింహ: రజనీ కాంత్ ... గొప్పగా బతికిన వాడు ... పూరి గుడిసె లో ఉంటాడు ... మళ్ళీ ఎదుగుతాడు ...

ఇది ఆక్షన్ సినిమాలకు పనికి వస్తుంది ... హీరో విలన్ పోటా పోటీ వున్నప్పుడు మాత్రమే ....


0 comments:

Post a Comment