Journey




Journey :

Script Points :

1.Contrast Nature :

రెండు లేదా మూడు లేదా నాలుగు  ప్రేమ కధ లను ఒకే సినిమా లో చూపిస్తున్నప్పుడు .. అన్నిటి మధ్య వుండాలి ... అంటే ఏ ప్రేమకధ కి ఆ ప్రేమకధ వెరైటీ గా వుండాలి .. ఒక దానితో ఇంకొకటి కలవకుండా కొత్తగా వుండాలి ..


అదే ఈ "జర్నీ" సినిమా లో వుంది ...
1. శర్వానంద్ + అనన్య
2. జై + అంజలి
ఈ రెండు జంటలు వాటి ప్రేమ లు ఒక కొత్త దనం తో వుంటాయి .. ఎలాగంటే

1. శర్వానంద్ సిటీ లో పెరిగిన వాడు .. ఫాస్ట్ గా వుండే కుర్రాడు ..
  అనన్య సిటీ కి కొత్తగా వచ్చిన పల్లెటూరి అమ్మాయి ..
ఇద్దరూ Opposite Nature…..
అబ్బాయి స్ట్రాంగ్ .. అమ్మాయి వీక్ ...
 
2. జై .. మెకానిక్ .. బెరుకుగా .. సిగ్గుగా .. మొహమాటం వున్న అబ్బాయి
అంజలి .. నర్స్ .. ఫాస్ట్ గా .. ఓపెన్ గా .. ఫ్రీగా .. వుండే మోడరన్ అమ్మాయి ..
వీళ్ళిద్దరూ Opposite Nature
అమ్మాయి స్ట్రాంగ్ .. అబ్బాయి వీక్ ...
ఈ మాత్రం వుంటే చాలు సీన్ లు అవే వస్తాయి ...
రెండు కు ఆలోచనల ఘర్షణ వుంటుంది .. అవే సీన్ లు గా .. మాటలు గా మారతాయి ...
ఇదే హ్యాపీ డేస్ (4 ప్రేమ కధలు), దిల్ చాహతా హై (3 ప్రేమ కదా లు) లోను చూస్తాము ..

2.Starting with Incident :


రెండు బస్సు లు ఆక్సిడెంట్ అయ్యాయి ... అందులో వున్న వాళ్ళ పరిస్తితి ఏమిటి? అందులో హీరో హీరోయిన్ లు వుంటే వాళ్ళు బ్రతికి వున్నారా? లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ మన మైండ్ లో తిరుగుతువుంటాయి ... అందుకే సినిమా చివరి వరకు చూస్తాము ... ఈ స్క్రీన్ ప్లే లాక్ వలన మనకు తెలియకుండానే సినిమా చూస్తూ వెళ్తాము .. క్యారెక్టర్ ల తో జర్నీ మనమూ చేస్తాము ...

3.Sub plots  with characters :



బస్సు లో చాలా క్యారెక్టర్ లు వున్నాయి ...
చూపులతో ప్రేమించుకుని, సెల్ ఫోన్ తో అడ్రస్ చెప్పుకునే ప్రేమ జంట
భార్య మీద ప్రేమ వున్న భర్త
కూతురి కోసం దుబాయ్ నుండి వస్తున్నా తండ్రి ...
ఒక చిన్న పిల్ల + మదర్
విజయవాడ వచ్చిందని టెన్షన్ పడే ప్రయాణికుడు ...
బస్సు లు రెండు తో కలిపి .. మంచి క్యారెక్టర్ లు వేసుకున్నారు ..
సింపుల్ గా వున్న కధ లో .. నాచురల్ గా వున్న ప్రయాణీకులు ..
ప్రతీ క్యారెక్టర్ కి ఒక స్టార్టింగ్ --- ఒక ఎండింగ్ వుంది ... అది కధ రాసే వాడు నిర్ణయించుకోవాలి ...
ఆ క్యారెక్టర్ ని చంపాలా? బ్రతికిన్చాలా? స్క్రిప్ట్ లో అవసరం ఉందా? లేదా? వుంటే ఉపయోగం ఏమిటి? ఇలా అన్ని కోణాలు ఆలోచిస్తే స్క్రిప్ట్ బాగుంటుంది ..

4.Screenplay :

కధ ఇన్సిడెంట్ (ఆక్సిడెంట్) తో స్టార్ట్ అయ్యింది ..  (ప్రేక్షకుడు అలెర్ట్ అవుతాడు ..)
పాత్ర ల పరిచయం అవుతూ. రెండు ప్రేమ కధ లలో ఒకొక్క ప్రేమ కధ ఓపెన్ చేయడం .. కట్ .. ప్రస్తుతానికి రావడం ... రెండవ ప్రేమ కధ చెప్పడం .. కట్ ప్రస్తుతానికి రావడం ... ఇలా స్క్రీన్ ప్లే ని ఇంట్రెస్ట్ గా నడిపి ప్రీ క్లైమాక్స్ లో పూర్తిగా ఆక్సిడెంట్ ని ఓపెన్ చేసారు ... ఇలాంటి స్క్రీన్ ప్లే లు రాయాలంటే మాములు విషయం కాదు ...

5.Songs :

A montage is a series of images showing a theme, an event, a contradiction, a passage of time, etc.

కధ ని ఇబ్బంది పెట్టకుండా .. రెండు ప్రేమ కధల్లో హీరో హీరోయిన్ లు జర్నీ చేసారో .. చూపించే Montage songs వుండటం వలన తక్కువ టైం లో ఎక్కువ కధ జరిగిందని మనం అనుకుంటాము .. ఇలా చేస్తేనే వాళ్ళు క్లోజ్ అయిన ప్రేమికులని గుర్తిస్తాము ... Montage songs లు ప్రేమ కధ వున్న ప్రతీ సినిమాలో వాడారు ..

బొమ్మరిల్లు - అప్పుడో ఇప్పుడో
ఖుషి - ప్రేమంటే సులువు కాదురా
గజినీ - హృదయం ఎక్కడున్నది
ఆర్య - నువ్వుంటే
నువ్వొస్తానంటే నేనొద్దంటాన - 1 నిలువద్దం నిన్నేప్పుడినా .. 2.. ఘల్ ఘల్

6.Attractions :

ఇటువంటి చిన్న సినిమాకు విజువల్స్ ఒక Attractions
సహజం గా మనం చూసే క్యారెక్టర్ లు
"మేఘమా" అనే భుజాలు ఊపే సాంగ్ ..

కధ అంతా అయ్యాక .. అందులో  Attractions కొన్ని అయినా పెట్టాలి .. అవే ప్రేక్షకుడి ని మళ్ళీ సినిమా హాల్ కి లాక్కోస్తాయి ...

7. స్ట్రాంగ్ గా వున్న క్యారెక్టర్ లను బ్రతికించారు (శర్వానంద్, అంజలి)
వీక్ గా వున్న క్యారెక్టర్ లను చంపారు ... హాస్పిటల్ బెడ్ మీద ఉంచారు (జై ... అనన్య)
అమాయకుడు, నవ్వించేవాడు చనిపోతేనే మనం ఫీల్ అవుతాము ... కదా…!

0 comments:

Post a Comment