Eega



Eega :

Script  points :

1. movie starting with strong villain Introduction : శక్తివంతుడయిన విలన్ ని, అతని క్యారెక్టర్ లో వుండే కామ గుణాన్ని ని చెబుతూ కధ మొదలు పెట్టారు ... ఇదే విషయం "అరుంధతి" లో చూస్తాము ...


2.Inner pain love : సినిమా లో మంచి ప్రేమకధ వుంది . రెండు సంవత్సరాలు వెనక తిరిగినా, ప్రేమిస్తున్నా నాని ని కనీసం పట్టించుకోదు సమంతా . కానీ నాని తన పాయింట్ అఫ్ వ్యూ లో దాన్ని ప్రేమ గా,. తనదయిన పాజిటివ్ ఆలోచనలు చేసుకుంటాడు ... చివరకు నాని ని ప్రేమిస్తున్నానని - సమంతా చేబుదామనుకుంటే నాని ని సుదీప్ చంపేస్తాడు ...
 ప్రేక్షకుడి కి నాని చనిపోవడం ముందు తెలుస్తుంది .. తర్వాత సమంతా కి తెలుస్తుంది ...
ఈ ప్రేమ కధ లో మొదట నాని పెయిన్ అనుభవించాడు ... తర్వాత సమంతా పెయిన్ అనుభవిస్తుంది .. ఆ ఇన్నర్ పెయిన్ సమంతా కి పెట్టాలి ..
రెండు సంవత్సరాలు - నాని ని బాధ పెట్టింది కాబట్టి ... అది ఉంటేనే నాని ఈగ గా మారిన తర్వాత తను కుడా కలసి సుదీప్ ని చంపడానికి ట్రై చేస్తుంది ...(మగధీర లో హీరో కి ఇన్నర్ పెయిన్ పెట్టారు .. ఫస్ట్ హాఫ్ లో)


3. నాని "ఈగ" గా మారడం ... అనేది లాజిక్ ను సవాలు చేసే అంశం .. దానికి గ్రాఫిక్స్ వాడి అద్భుతం అన్నట్టు చూపించాడు ... (ప్రేక్షకులు ప్రేమికుడయిన నాని వైపు వుంటారు కాబట్టి ఓకే అనుకుంటారు). తర్వాత ఈగ ఏమిచేయాలి? నిద్రపోయిన మనకు తెల్లారగానే కొన్ని గుర్తుంటాయి .. కొన్ని గుర్తుండవు ... అలాగే "ఈగ" గా పుట్టి న నాని మొదట ఏమి చేయాలి?
ఇక్కడ కధను కొన్ని దశలు గా రాజమౌళి విభజించాడు ...

Phase -1 : మొదట "ఈగ" ను చిన్న ప్రాణి లాగే ఉంచాడు ... దానికి ఇబ్బందులు సృష్టించాడు ... ఇలా గ్రాఫిక్స్ కు తెర రూపం కల్పించాడు ... ఆ ఇబ్బందుల్లో మనకు ఈగ మీద సానుభూతి కలుగుతుంది ..


Phase -2 : అలా .... ఆ ప్రాసెస్ లో సుదీప్ దగ్గరకు వెళ్లి పడతాడు ... అప్పుడు గత జన్మ గుర్తుకురావడం ... సుదీప్ ని గుర్తుపట్టడం ... సుదీప్ ముఖం మీద .. చెవులలో పడటం ... సుదీప్ విసిరి కొట్టడం ... ఇక్కడ వరకు సామాన్య ఈగ లాగానే చూపించాడు ... ఈగ ఫెయిల్ అయ్యింది .. అది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తెలుస్తూనే వుంటుంది ... ఈ రెండు దశల్లో మనకు "ఈగ" మీద సానుభూతి వస్తుంది ...

Phase -3 : సుదీప్ - సమంతా ని డిల్లీ ప్రయాణం - రెడీ గా ఉండమన్నాడు .. అప్పుడు "ఈగ" 
ఆక్టివ్ గా మారి పోతుంది ...
సుదీప్ ని నిద్ర లేకుండా చేస్తుంది ...
తర్వాత ట్రాఫిక్ జామ్ చేస్తుంది ...

తర్వాత సుదీప్ కి ఆక్సిడెంట్ చేసి "ఐ కిల్ యు" అని వార్నింగ్ ఇస్తుంది ...

ఇందులో మూడు ఇన్సిడెంట్స్ వున్నాయి ..
1 ఈగ చేయగలదు (నిద్రలేకుండా చేయడం) ..
మిగిలిన రెండు సినిమాటిక్ ... కధ కు అవసరం ... తప్పదు ...
ఇప్పటి వరకు సుదీప్ ని శారీరక దాడి చేసాడు ... మానసిక దాడి చేసాడు ...

Phase -4 : సుదీప్ దగ్గరకు సమంతా రావడం .. ఈగ మీద హిట్ కొట్టడం .. ఈగ మూర్చ పోయి పడిపోవడం .. మళ్ళీ సమంతా వలెనే నీళ్ళు పడటం .. (ఇక్కడ మనకు "అయ్యో" అనిపిస్తుంది) ... ఈగ బ్రతికి సమంతా దగ్గరకు వెళ్లి "నేనే నాని నే" అని చెప్పడం ..

ఎందుకంటే "ఈగ" ఒక్కటే అన్ని పనులు చేసిందంటే నమ్మరు .. అందుకే సపోర్ట్ కావాలి ... అది హీరోయిన్ ని రక్షించడానికే కాబట్టి ... అందుకే సమంతా సపోర్ట్ ఇస్తుంది ... ఇక్కడ ఈగ చేత విన్యాసాలు చేయించి .. ఈగ చేయగలదు అని Montage song తో నమ్మించాడు ...

Phase -5 : ఇప్పటి నుండి సుదీప్ ని ఆర్ధికం గా దాడి చేస్తాడు .. సుదీప్ ప్రాజెక్ట్స్ అన్నీ నాశనం చేస్తాడు ... కాంట్రాక్ట్స్ పోగొడతాడు ... పరువు తీస్తాడు ... చివరకు డబ్బు కుడా తగలపడి పోతుంది ...



Phase -6 : ఇప్పటి వరకు విలన్ డౌన్ లో ఉంటాడు .అన్ని విధాల నాశనం అయ్యాకే మనిషి మేల్కొంటాడు . అలాగే సుదీప్ మేల్కొని "తంత్ర" ద్వారా ఈగ ని నాశనం చేయాలనీ చూస్తాడు . కానీ కుదరదు ...సమంతా హెల్ప్ చేసిందని తెలుసుకుంటాడు ... 
సమంతా ముందే "ఈగ" ని చంపుదామనుకుంటాడు .. కానీ "ఈగ" చస్తూ, సుదీప్ ని చంపుతుంది ...
మళ్ళీ "ఈగ" పుట్టి సమంతా దగ్గర వున్నట్టు చేసాడు ...

Drama point :

నాని ఈగ అనే విషయం మొదట ప్రేక్షకుడి కి చెప్పాలి .. తర్వాత సమంతా కి చెప్పారు .. తర్వాత సుదీప్ కి చెప్పారు .. చివరిగా విలన్ దగ్గర మనుషులందరికీ తెలుస్తుంది ... ఈ ప్రాసెస్ లో డ్రామా పాయింట్ మొదట చెప్పాల్సింది ప్రేక్షకుడికే .. లేకపోతే అది పండదు ...
దూకుడు లో మహేష్ బాబు ఆడే గేమ్ కానీ ... డీ లో ఆడే గేమ్ కాని ... ది గ్రేట్ "మాయ బజార్" లో కృష్ణుడు ఆడే గేమ్ కానీ ముందుగా తెలియాల్సింది ప్రేక్షకుడికే .... అప్పుడే ప్రేక్షకుడు "తనకు తెల్సిన సీక్రెట్ - ఆ డ్రామా పాయింట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని తెలియకుండా ఎదురుచుస్తాడు ... ఓపెన్ అయ్యాక "ఏమి జరుగుతుందో?" అని ఆదుర్దా పడతాడు ...

Asset -1: కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... సినిమాకి ప్రాణం .. ఈగ అనందం గా వున్నప్పుడు .. పడిపోయినప్పుడు ... బాధపడే టప్పుడు ... మేల్కొని పోరాడే టప్పుడు .. ఇలా రకరకాలు గా మ్యూజిక్ ఇచ్చి నిలబెట్టారు .. రాజమౌళి "ఈగ" కి ఫీల్ ని తెచ్చింది.
సాంగ్స్ అన్నీ బాగుండటం చాలా ప్లస్ ...

Asset -2 : గ్రాఫిక్స్ .. "ఈగ" చాలా చిన్న ప్రాణి .. దాన్ని చూపించాలి .. దాని ముఖ కవళికలు, భావాలు, డాన్సు లు, మూవ్మెంట్ లు ఇలా ఎంత ఆలోచిస్తే ఈ కధ కి గ్రాఫిక్స్ చేయగలరు ...? అద్భుతం .. ఒక చిన్న "ఈగ" తో అద్భుతం గా గ్రాఫిక్స్ చేకూర్చారు .... (బులెట్ సైజు కన్నా .. ఈగ సైజు చాలా చిన్నది .. అక్కడ "ఈగ" పెద్దది అన్నట్టు చూపారు)
Plantings and payoffs :

"ఈగ" బాంబు మెటీరియల్ ని సుదీప్ దగ్గర వున్న బొమ్మ ఫిరంగి లో పెడుతుంది .. అది క్లైమాక్స్ లో దాన్ని ఉపయోగించుకుని చంపుతుంది ...

Setup : 1.హీరోయిన్ సమంతా కి మైక్రో ఆర్టికల్స్ చేసే టాలెంట్ పెట్టడం ... అది "ఈగ" కు ఆయుధాలు చేయడానికి ఉపయోగపడేలా చేసున్నాడు ..


2.విలన్ సుదీప్ కి కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్స్ వుండే బిజినెస్ పెట్టడం వలన సెకండ్ హాఫ్ లో చాలా సీన్ లకు పనికి వచ్చేల కధ అల్లుకున్నారు ...


0 comments:

Post a Comment