Dookudu





Dookudu :

బంధాల మీద తీసిన సినిమాలు హిట్ అవ్వడానికి ఛాన్స్ వుంటుంది ... ఎందుకంటే భారత దేశం లో వున్నా మనం బంధాలకు వేల్యూ బాగా ఇస్తాము కాబట్టి .....

అమ్మ - తన కొడుకు కోసం - (మదర్ ఇండియా ... మాతృదేవోభవ)
కొడుకు - అమ్మ కోసం - (చత్రపతి (రాక్షషుడు))

నాన్న - కొడుకు / కూతురు కోసం - (వారసుడు, కంకణం)

కొడుకు - నాన్న కోసం - (అడవి లో అన్న, క్షత్రియ పుత్రుడు, మేజర్ చంద్ర కాంత్, జస్టిస్ చౌదరి)

తమ్ముడు - అన్న కోసం - (తమ్ముడు, పెదరాయుడు, సీతమ్మ వాకిట్లో .. సిరి మల్లె చెట్టు)

అన్న - తమ్ముడి కోసం - (అన్నయ్య, సంక్రాంతి, సీతారామ రాజు)

Values :- Every story has a main theme or value : 

one word that express what the story is about :truth ,justice ,honesty ..etc..

ఒక తండ్రి కోసం కొడుకు పడే ఆరాటం, తపన ....

Creating emotion in the audience :-

Empathy : when the character experiences a reversal, the audience  experiences is too. This emotion lasts  for the duration  of the turning point .

హీరో మహేష్ తన తండ్రి కోసం చేసే పనులు .. పడే కష్టం తో మహేష్ క్యారెక్టర్ ని మనం ఫీల్ అవుతాము .. అతను చేసేది కరెక్ట్ అనుకుని అతని తో ట్రావెల్ చేస్తాము ..
 
చివరకు హీరో ఇబ్బంది పడినా .... టెన్షన్ పడినా మనమూ అలాగే ఫీల్ అవుతాము ...

ఈ ఎమోషన్ ప్రేక్షకుడి లో కల్గిస్తే చాలు ... సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది ...

Structure of subplots:

Just like the main plot ,it has  clear setup, turning points ,Developments  and a satisfying payoff at the end .


మహేష్ - సమంతా ల లవ్ ట్రాక్ కుడా మంచి సెటప్ తో స్టార్ట్ అవుతుంది ... మంచి టర్నింగ్ పాయింట్స్ వుంటాయి ... ఇద్దరు కలసినట్టే వుంటారు .. విడిపోతుంటారు .... మళ్ళీ కలుస్తుంటారు .చివరిగా ప్రీ క్లైమాక్స్ పెళ్లి లో ఒకటి అవ్వడం తో ఈ ట్రాక్ కంప్లీట్ అవుతుంది ....

Must intersect with main plot :

The sub plot cannot be a “ free floating vapor “..it must intersect and dimensionalize the plot line .Do this by making  the sub plot a variation on the main theme  or tying the outcome of the main plot with the outcome of the subplot .

మహేష్ - సమంతా ల లవ్ ట్రాక్ ... మెయిన్ ట్రాక్ లో కలసి పోయేలా ప్లాన్ చేసారు ... మహేష్ ఫై అధికారి నాజర్ కూతురు గా సమంతా ని పెట్టడం వలన లవ్ ప్లాట్ .. మెయిన్ ప్లాట్ లో కలసిపోయినట్టు వుంటుంది .. సపరేట్ గా కనపడదు ...

Conflicts : Relational (inter-personal )

Conflicts with others usually just one person:

Protagonist versus antagonist…

తన బాబాయ్ ని చంపి / తండ్రి ని చంపాలని చూసిన వాళ్ళందరినీ హీరో చంపడమే కధ .. ఇది Revenge Format కధ ... అయితే ఇక్కడ తండ్రి చేతే విలన్స్ ని చంపించడం ఆ ప్లే ఇంట్రెస్ట్ గా సాగుతుంది .. ఒక విధం గా చూస్తే నార్మల్ కధే ...

అయితే అండర్ వరల్డ్ డాన్ నాయక్ ని పట్టుకోవడం-- మహేష్ పోలీస్ ఆఫీసర్ గా లక్ష్యం ... అదే నాయక్ ని పట్టుకునే ప్రయత్నం లో ... నాయక్ తమ్ముడు ని బంటీ ని పట్టుకోవడం ... ఆక్షన్ సీన్స్ అల్లుకున్నారు .... నాయక్ ని హీరో personal revenge  కి ముడి పెట్టడం తో అంతా కలసిపోయింది ...

Structure : In drama ,the narrative drive propels the story unstoppably forward .


ఈ సినిమా లో మంచి డ్రామా పాయింట్ వుంది .. 20 ఇయర్స్ తర్వాత షాక్ నుంచి కోలుకున్న తండ్రి ని - ఒక కొడుకు కాపాడుకోవడం ... ఈ పాయింట్ చాలు కధ ఎలా వుండాలి .. దానికి హీరో ఏమేమి చేయాలి .. అని ...

అందుకే తండ్రి కోలుకోగానే ఒక పాత ప్రపంచాన్ని అల్లుతాడు ... రియాలిటీ షో అని అందరికీ చెప్పి నమ్మిస్తాడు ... డౌట్స్ వస్తే తీరుస్తాడు ... అన్నీ చేస్తాడు ...
తండ్రి సున్నిత మనిషని ... విలన్స్ అందరినీ సున్నితం గానే చంపిస్తాడు ... ఈ డ్రామా పాయింట్ చివరిలో ఓపెన్ అవుతుంది...

In comedy ,however ,you can stop the story and throw in a scene that has nothing at all to do with the story, just laughs….



రియాలిటీ షో తో బ్రహ్మానందాన్ని .. సినిమా పేరు తో ఎం. ఎస్. నారాయణని స్టొరీ లో కలపడం వలన స్టొరీ ఏమి పాడు కాదు ... కేవలం నవ్వుల్లో ముంచెత్తుతుంది ... అంతే .. తెలుగు ప్రేక్షకుడు కి హాస్యం వున్నా కధ చాలు ... అవే సూపర్ హిట్ అవుతాయి ... కధ లో హాస్యం ఉండేలా ప్లాన్ చేయాలి .. అంతేగానీ హాస్యమే కధ కాకూడదు ...

Blind obsession : Comedy characters are not self aware..they are blindly obsessive.

గుడ్డి గా నమ్మే పాత్రలు .. బ్రహ్మ నందం .. ఎం. ఎస్. నారాయణ

క్యారెక్టర్ కి ఒక వీక్ నెస్ పెట్టి .. ఆ వీక్ నెస్ మీద హీరో ఆటాడు కోవడం ...

బ్రహ్మానందం - "నా అంత తెలివయిన వాడు లేడు" అనే లాక్ లో ఉంటాడు .... దాన్ని అలాగే చివరవరకు కంటిన్యూ చేయడం .... చాలా ఫన్ వస్తుంది ...

ఎం ఎస్ నారాయణ కి హీరో అవ్వాలన్న పిచ్చి వుంటుంది ... దాన్ని అడ్డం పెట్టుకుని ఒక కధ అల్లి -.. ట్రాప్ చేయడం కుడా బాగుంటుంది .. అంతా హీరో చేస్తూ - ఈ రెండు పాత్రలు తామే అంతా చేస్తున్నామని లాక్ లో పెట్టి క్లైమాక్స్ లో ఓపెన్ చేయడం తో రెండు పాత్రలకు దిమ్మ తిరుగుతుంది. . ప్లే అంటే అదే ...

- హీరోయిన్ తననే ప్రేమిస్తుంది అని అనుకునే బట్టు పాత్ర (అదుర్స్)

- తనే పాత్రల్ని సృష్టించానని అనుకునే మెక్ డోనాల్డ్ మూర్తి పాత్ర (రెడీ)

- తనే గొప్పవాడిని అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర (కింగ్) .. ఇవన్ని ఒక లాక్ లో వున్నా 
క్యారెక్టర్ లు ... వీళ్ళని హీరో ఆడుకుంటే ఫన్ వస్తుంది ... ఇరికించాలి .. ఇబ్బంది పెట్టాలి ... ప్రతీ సారీ కొట్టకూడదు ..

Common thread : the hero is certain of one thing, while life is conspiring instead to throw at him the complete opposite.

హీరో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నాయక్ ని పట్టుకోవాలనుకుంటాడు .. అయితే తండ్రి ప్రకాష్ రాజ్ కోమాలోంచి బయట పడటం తో .. తండ్రి ని బాగా చూసుకొనే బాద్యత మీద పడుతుంది .. పోలీస్ పాత్ర పక్కకు పెట్టి ఎం. ఎల్. ఎ పాత్ర మహేష్ వేస్తాడు ... అదే ఈ త్రెడ్ ... .
 

Setup : must be done firmly enough so the audience will remember it when the pay-off comes around. Don’t be too heavy handed.

మహేష్ తన తండ్రి కోసం ఒక ప్రపంచం అల్లు తాడు ... తన పగ కోసం కుడా కొన్ని సృష్టిస్తాడు ... ఇవన్నీ హాల్ లో చూస్తున్నంత సేపు సెంటిమెంట్ గా, సరదా గా వుంటాయి ... అంతా క్లియర్ గా చెబుతారు ... ప్రేక్షకుడి కి వచ్చే డౌట్స్ కుడా ముందుగానే క్యారెక్టర్ ల ద్వారా చెప్పించి .. వాటిని మహేష్ అధిగమించేలా చేసారు

Scenes : 

మహేష్ తండ్రి ప్రకాష్ రాజ్ కి వచ్చే డౌట్స్ .. తమ్ముడు సత్యం గురించి అడిగినప్పుడు .. చంద్ర మోహన్ ఎన్.టి. ఆర్ గురించి అడిగినప్పుడు మహేష్ టెన్షన్ పడుతూ వాటిని కవర్ చేస్తూ సెంటిమెంట్ పండిస్తూ వుంటే ఎమోషన్ క్యారీ అయ్యింది .. మహేష్ ఆడే డ్రామా పాయింట్ ఎక్కడ ఓపెన్ అవుతుందేమో అనే ఉత్సుకత, టెన్షన్ అడుగడుగునా కలుగుతాయి ..

హీరో కి తండ్రి పాత్ర ద్వారా ఇబ్బండులోస్తే అధిగమిస్తాడు ... హీరో ఇబ్బంది పడినప్పుడల్లా ఇప్పుదేమిచేస్తాడో హీరో? అని ప్రేక్షకుడు ఎదురుచుస్తారు ... ఆ ఇబ్బందిని హీరో అధిగమిస్తే "హమ్మయ్య" అని అనుకుంటారు .. మధ్యలో కామెడీ .. కాసేపు .. ప్రేమ కాసేపు .. ఫైట్ కాసేపు ... కొన్ని మలుపులు ... ఇలా అన్ని సమ పాళ్ళలో ఉండేలా సీన్ లు వుండాలి ..

Creative clue :


1.
Good by lenin లో ఒక కొడుకు - తన 20 ఏళ్ళ తర్వాత కోమా లోంచి బయట పడిన అమ్మ కోసం పడే తపన ... ఇదే కధ లో అమ్మ ప్లేస్ లో తండ్రి వచ్చాడు ... కానీ ఈ కధ ను తీసుకుని కామెడీ సృష్టించి నడపడం సామాన్య విషయం కాదు ... దానికీ తెలివితేటలు వుండాలి .. ఆలోచనలు కావాలి ....


2. Welcome  లో నానా పటేకర్ కు సినిమా పిచ్చి వుంటుంది .. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని హీరో అక్షయ్ కుమార్ ఆడుకుంటాడు .. (ఎం. ఎస్. నారాయణ బ్లాక్)

 






3.Tara rum pum  లో పేదరికం కనపడకూడదని రాణి ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్ సెకండ్ హాఫ్ లో రియాలిటీ షో అని పిల్లలకి చెబుతారు .. అక్కడ సెంటిమెంట్ కోసం వాడారు .. ఇక్కడ కామెడీ కోసం వాడారు ... (బ్రహ్మానందం బ్లాక్)


                        ------------------------------------------------------------

ఒక పెద్ద హీరో కి కధ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగర్తలు అన్నీ ఇందులో తీసుకున్నారు ..

1. మహేష్ బాబు ఇంతకుముందు చేయని ఒక ఒక క్యారెక్టర్ వుంది .. అదే ఎం. ఎల్. ఎ పాత్ర ...
2 మహేష్ -. ఒక తండ్రి కోసం ఆరాటపడే క్యారెక్టర్ కూడా చేయలేదు ...
ఈ రెండు పాయింట్స్ చాలు కధ ను ఒకే చెప్పడానికి ...
3. బ్రహ్మానందం .. ఎం. ఎస్. నారాయణ పాత్రలను కధ లో కలుపుకుంటూ వెళ్ళడం ... కామెడీ మొత్తం ఆ రెండు పాత్రలతో హీరో చేయించడం .. చివర వరకు వాడి పడేయడం. బాగుంటుంది .. ఇదే పెద్ద ప్లస్ పాయింట్స్....
4. మాఫియా నాయక్ నుండి మొదలు పెట్టి. తండ్రి ని మోసం చేసిన లోకల్ విలన్స్ అందరినీ కలిపే Revenge format story
మొత్తం గా మహేష్ బాబు చరిష్మా + కొత్త కధ + శ్రీను వైట్ల కామెడీ మార్క్ = దూకుడు...


0 comments:

Post a Comment