Tare Jameen Par





Iran film soul + Indainised Concept +Simplicity +Sensivity =Tare Jameen Par 

Mind +Heart కలిస్తే script work  complete అవుతుంది ..

మైండ్  Commerciality కోరుకుంటుంది ..

హార్ట్  Artistic values ని కోరుకుంటుంది ...

mind 75% + heart 25 % = telugu cinema 

mind 50% + heart 50 % = tamil cinema 

mind 25% + heart 75 % = Hindi cinema 

ఇలా అవ్వడానికి చాల రీజన్స్ వున్నాయి .. Lack of creativity ,Market ,Producers
ధైర్యం లేకపోవడం ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు .ఈ Discussion నుండి తప్పించుకోవచ్చు .పాత తరం దర్శకుల తర్వాత కొత్త తరం దర్శకులు ఎంత మంది మంచి సినిమాలు తీస్తున్నారు? మనం ఎందుకు ఇలా వుండి పోయాము?

విమర్శించడం ఇక్కడ ముఖ్యం కాదు .. మనకు ఆత్మ విమర్శ ముఖ్యమని నా ఆలోచన ...
                                                      
                                           ------ok ------coming to the point ------------
 
plot line :  dyslexic (అక్షరాలు గుర్తుపట్టలేని వ్యాధి ) అనే వ్యాధి తో బాధ పడుతున్న ఒక చిన్న పిల్లవాన్ని తల్లిదండ్రులు దూరం గా ఉంచితే, ఒక బాధ్యత కలిగిన టీచర్ అతన్ని సరి అయిన దారి లో పెట్టి, అతనిలో ఆత్మ విశ్వాసం నింపడమే కధ ...

1. సినిమా లో ముఖ్య పాత్ర కు, మిగిలిన పాత్రలకు వుండే ఎమోషన్స్ ప్రేక్షకుడి కి కనెక్ట్ అయితే చాలు .. ఆ సినిమా సక్సెస్ అవుతుంది ... (ఇది సినిమా కధ ఆలోచించే ప్రతీవాడికీ తెలియాల్సిన రూల్)


ఈ సినిమా కధ లో ఇషాన్ అవస్థి .. చిన్న పిల్ల వాడి క్యారెక్టర్ .. అతని ఫాదర్
, మదర్ క్యారెక్టర్ లు ... రామ్ శంకర్ (అమీర్ ఖాన్) అనే టీచర్ క్యారెక్టర్ లు ఎమోషన్స్ పండించాయి ... అందుకే సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది ... ముఖ్యం గా ఇషాన్ క్యారెక్టర్ ... చిన్న పిల్లవాడి మీదే సినిమా అంతా నడుస్తుంది ... అతని క్యారెక్టర్ తో మనం ట్రావెల్ చేస్తాము ... అతని బాధని ఫీల్ కావడం కోసమే ఫస్ట్ హాఫ్ అంతా నడిపారు ...

ఫస్ట్ హాఫ్ రెండు పార్ట్ లు
1. ఇషాన్ ఇంట్లో వున్నప్పుడు.......
2. ఇషాన్ బోర్డింగ్ హాస్టల్ లోకి వెళ్ళాక

మెయిన్ క్యారెక్టర్ ఇషాన్ మీద సానుభూతి తారాస్తాయికి చేరుకున్నాక .. అమీర్ ఖాన్ వస్తాడు .. నవ్విస్తాడు ... ఇషాన్ ని బాధ ని గమనిస్తాడు ... ఇషాన్ ని మామూలు పిల్లాడిలా మార్చి, ఆత్మ విశ్వాసం నింపుతాడు ... అదీ కధ ...

2.first Establish your main character .Who is your story about ?


సినిమా కధ ఎవరిదీ? ఇషాన్ అనే చిన్న పిల్ల వాడిది ... అందుకే అతన్నే ముందు చూపిస్తారు .. అమాయకం గా చేపలు పడుతూ ఉంటాడు ... స్కూల్ వాన్ డ్రైవర్ వచ్చి బస్సు లో వేస్తాడు ... ఇంటికి వెళ్ళడానికి టైం వుంది .. అప్పుడు పూర్తి టైటిల్స్ .. అదీ చిన్న పిల్లవాడి సినిమా తగ్గట్టు కార్టూన్ యనిమేషన్ ద్వారా వేసాడు .. అదీ క్రియేటివిటీ అంటే ...


3.you must find ways to reveal your characters conflicts visually ...

ఇషాన్ కి  dyslexic వ్యాధి వుంది .. అది విజువల్ గా చూపించడానికి కుదిరేలా టైటిల్ స్టార్ట్ చేసారు .... హోం వర్క్ బుక్స్ లో అతని వ్యాధి లక్షణాలు చూపించవచ్చు .. అదే చేసారు .. ఇషాన్ లో ఒక కళ వుంది - అదే పెయింటింగ్ .. అది కుడా విజువల్ గా చూపించవచ్చు .. . (ఇదే విషయం "సిరివెన్నల" సినిమా లో చూస్తాము - సుహాసిని కి పెయింటింగ్ వచ్చు .. అలాగే "స్వర్ణ కమలం" లో వెంకటేష్ కి కుడా .. సినిమా లో విజువల్ గా కనపడేలా చూసుకుంటారు

4.Film is behavior.we can know alot  about characters by how they react , or behave ,in certain situations ...

చినపిల్లవాడి మనస్తత్వం తెలిస్తే అదే ఇషాన్ క్యారెక్టర్ .. పిల్లవాడు అలా ప్రవర్తించడానికి కారణాలు తెలిసుకుని .. ఆపాత్ర లోకి వెళ్లి కధ, సీన్ లు రాసుకోవాలి ...

చదవడం రాదు అన్నప్పుడు ఎస్కేప్ అవుతారు .. ఆటల్లో మునుగుతారు .. తోడు, ప్రేమ కోసం పరితపిస్తారు .. నిజాయితీ గా వుంటారు ... నవ్విస్తారు ... స్కూల్ కెల్లా లంటే బద్ధకం గా వుంటారు ... వెళ్ళినా మనసు పెట్టలేరు ... ఇలా ఆలోచిస్తూ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తే సీన్ లు అవే వస్తాయి ... క్యారెక్టర్ మీద సానుభూతి కలిగేల సీన్ లు వుండాలి ... వ్యాధి గురించి మనకు ఫస్ట్ హాఫ్ లో తెలియదు ... తెలిసాక ఇంకా సానుభూతి వచ్చేలా చేసారు ...


5.if your character is a parent ,she /he could reflect a parents point of view...
or  he/she could be student or Teacher and view the world from his point of view...

ఇందులో వున్న క్యారెక్టర్ లు ఫాదర్, మదర్, స్కూల్ టీచర్స్, బోర్డింగ్ హాస్టల్ టీచర్స్, అమీర్ ఖాన్ ..

ఏ క్యారెక్టర్ అయినా అతని పాయింట్ అఫ్ వ్యూ లో నే మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది ...
ఫాదర్ - తన బిడ్డ ఫస్ట్ రావాలని కోరుకుంటాడు .. తక్కువ మార్క్స్ వస్తే తిడతాడు .. కర్కశం గా ఉంటాడు ..

మదర్ - ప్రేమ పంచుతుంది, బాధ పడుతుంది .. అన్ని పనులు చేస్తుంది .. కానీ ఏమి చెయ్యలేని నిస్సహాయురాలు ...

మిగిలిన టీచర్ లు అందరు అంతే ..
అమీర్ ఖాన్ - టీచర్ క్యారెక్టర్ చాలా గొప్పగా ఆలోచిస్తుంది .. బాధపడుతుంది ... సరిదిద్దుతుంది .. ఇషాన్ నే కాదు .. అతని ఫాదర్ ని కుడా ...

6. స్టార్టింగ్: ఇషాన్ వ్యాధి ని విజువల్ గా చెప్పడం
ప్లాట్ పాయింట్ -1: ఇషాన్ ని బోర్డింగ్ స్కూల్ లో చేర్చడం
మిడ్ పాయింట్: అమీర్ ఖాన్ బోర్డింగ్ స్కూల్ క్లాసు లో ఎంటర్ అవ్వడం
ప్లాట్ పాయింట్ -2: ఇషాన్ లో dyslexic వ్యాధి ని అమీర్ ఖాన్ గుర్తించడం
ప్రీ క్లైమాక్స్: ఇషాన్ లో పూర్తిగా పెయింటింగ్ ద్వారా ఆత్మ విశ్వాసం నింపడం (పెయింటింగ్ పోటీ)
క్లైమాక్స్ (ఎండింగ్): పూర్తిగా మారిపోయిన ఇషాన్ ని అతని ఫాదర్, మదర్ తీసుకెళ్లడం..

7.Good scenes:



 


A. అమీర్ ఖాన్ - dyslexic వ్యాధి గురించి క్లాసు లో చెప్పి ... ఇషాన్ కి దగ్గర కావడం ...
B.ఇషాన్ మదర్ - ఇషాన్ చిన్న తనం లో తీసిన వీడియో చూసి బాధ పడటం
C. టైటిల్ సాంగ్ లో ఇషాన్ పేరెంట్స్ పెద్దకొడుకు విషయం లో వున్న జాగర్త, ఊహలు .. చిన్న కొడుకు ని దూరం గా వుంచడం
D. ఇషాన్ పేరెంట్స్ దగ్గరకు అమీర్ ఖాన్ వెళ్ళిన సీన్
E.ఇషాన్ ని అమీర్ ఖాన్ పెయింటింగ్ ద్వారానే మార్చే సీన్ లు ... క్లాసెస్ చెప్పడం ..
F.ఇషాన్ - ఫాదర్ బోర్డింగ్ స్కూల్ కి వచ్చినప్పుడు అమీర్ ఖాన్ తో మాట్లాడే సీన్ ..
 

G.ప్రీ క్లైమాక్స్ లో పెయింటింగ్ పోటీ సీన్
ఇలా చాలా కదిలించే సీన్ లు, మాటలు వున్నాయి ...

సీన్ లు గమనించండి ... ఇషాన్ dyslexic వ్యాధి కారణం గానే బాల్ ని రాంగ్ గా విసురుతాడు ... దానివలనే క్రికెట్ అదే పిల్ల వాడితో గొడవ వస్తుంది .. అది పేరెంట్స్ గొడవకి --- ఫాదర్ ఇషాన్ ని తిట్టడానికి దారి తీస్తుంది ...
ఇలా వ్యాధి కారణం గానే సీన్ లు జరుగుతాయి ....

8.Contrat Nature : ఇషాన్ - ఇషాన్ అన్న కి తేడా వుంది ... ఇషాన్ అన్నింటిలో లాస్ట్ వస్తాడు .. అతని అన్న అన్నింటిలో ఫస్ట్ వస్తాడు .. పేరెంట్స్ ఇద్దరినీ ఒకేలా చూడరు ... అది బాగా ప్లే చేసారు .. (నిజమే కదా - నాకొడుకు గొప్పవాడు అని చెప్పుకోడానికి పేరెంట్స్ ముందు వుంటారు .. నాకొడుకు వెధవ అని చెప్పుకోడానికి ముందు కి రారు కదా)..


           ----------------------------------------------------
Core competency :

ఒక సచిన్ టెండూల్కర్ ని - అతని అన్న, తండ్రి గుర్తించారు ..
కానీ ధోని ని అతని ఫాదర్ గుర్తించలేదు .. వాళ్ళ అక్క గుర్తించింది ..
విశ్వనాథ్ ఆనంద్ ని వాళ్ళ మదర్ గుర్తించింది ..
అబ్దుల్ కలాం ని అతని కి అతనే గుర్తిన్చుకున్నాడు ...
నైనా సేహ్వాల్ ని ఆమె ఫాదర్ గుర్తించాడు ..

ప్రతీ పిల్లవాడి లోను ఒక కళ .. ఒక ఇంట్రెస్ట్ .. వుంటుంది ... ఆ రంగం ఏదో గుర్తించాలి .. అది క్రికెట్, పెయింటింగ్, డాన్సు, ఆక్టింగ్ .. రైటింగ్ .. ఇలా ఏదో ఒకటి వుంటే ముందుగా పేరెంట్స్ గుర్తించాలి ... ఆ విధం గా ప్రోత్సహించాలి .. అప్పుడే ఆ పిల్ల వాడు ఈ భూమ్మీద పుట్టినందుకు జన్మ సార్ధకం అవుతుంది .. పేరెంట్స్ కి ఆనందం మిగులుతుంది .. భారతమాత కు ప్రపంచపటం లో కీర్తి దక్కుతుంది ...


0 comments:

Post a Comment