Lagaan


Lagaan 

Fiction ...........complete fiction...............

కల్పిత కధ ..

బ్రిటీష్ హయాం లో .. ఒక ప్రాంతం లో ఉన్నవారికి ... బ్రిటీష్ వారికి మధ్య క్రికెట్ జరిగితే .. అనే ఆలోచనల్లోనుండి పుట్టిన కధే "లగాన్" ....

ఇది జరగదు .. జరిగితే ఎలా వుంటుంది అనేదే కధ అవుతుంది ... దాన్ని ఎంత గా నమ్మించే ప్రయత్నం చేసాము .. ఆ వాతావరణాన్ని ఎంత గా ప్రెసెంట్ చేసి ... అన్ని ఎలిమెంట్స్ పెట్టి హిట్ చేసారు ... అన్నదే ముఖ్యం ... అలాంటి సినిమాలు చాల వున్నాయి ...

1.జగదేక వీరుడు .. అతిలోక సుందరి ..

అతిలోక సుందరి వుండదు .. వుంటే? భూమి మీదకు వస్తే .. ఒక హీరో తో ట్రావెల్ చేస్తే? ఆ అవసరం ఏమిటి? ... ఇలా కధ పుట్టి .. అది సినిమా గా మారి బ్లాక్ బస్టర్ అయ్యింది ...

2. టాగోర్ అనే వాడు ఉంటాడా? ... వుంటే .. అవినీతి చేసిన అందరిని కిడ్నాప్ చేసి
వాళ్ళలో నెంబర్ వన్ ని చంపి సమాజానికి మేలు చేస్తే ఎలా వుంటుంది? ... ఎందుకు చేయాలి ... చేస్తే ఏమౌతుంది? .. ఇలా ఆలోచనల్లో నుండి వచ్చిన కధ .. సూపర్ హిట్ సినిమా అయ్యింది ..

3. "ఆర్య" అనే వాడు ఉంటాడా? ఇద్దరి ప్రేమికుల మధ్య .. ఇంకొకడు వచ్చి ఫీల్ మై లవ్ అంటే వాళ్ళు రానిస్తారా? ఎలాంటి ప్రేమికులు రానివ్వగలరు? రానిస్తే ఏమిజరుగుతుంది? .... ఇలా కధ అల్లు కుంటూ పోతే .. అదే పెట్టిన 4 కోట్లకు ... 16 కోట్లు వసూలు చేసింది ...

4. "ఈగ" - చనిపోయిన మనిషి మళ్ళీ పుడతాడా? . ఈగ లా పుడితే .. వాడు ప్రేమికుడు అయితే ..? పగ తో విలన్ ని చంపితే .. అదే "ఈగ" ..

ఇదే కాదు .. ఏ కధ లో అయినా కాస్త ఫిక్షన్ పాయింట్ వుండాలి .. అది బాగుంటే. సినిమా స్క్రిప్ట్ ని మంచి గా చేసుకుంటే హిట్ గ్యారంటీ ...
దేనికయినా స్క్రిప్ట్ వర్క్ బాగుండాలి ....
ప్లాట్ లైన్ బాగుండాలి.....
స్టార్టింగ్, మిడిల్ .. ఎండింగ్ చూసుకోవాలి ..
క్యారెక్టర్ లు సరిగ్గావేసుకోవాలి .... ఫార్ములా లు పెట్టుకు ని .. మంచి సీన్ లు వేసుకుంటే సరిపోతుంది ... ఇలా కధ లు రాసుకున్న వారు పెద్ద డైరెక్టర్ లు అవుతారు ....
టైటానిక్ ఇలాంటిదే .... అవతార్ ఇలాంటిదే ....
----Ok -------coming to the point ---------------
 
Voice over Narration : టైటిల్స్ వేస్తుంటే .. ప్రేక్షకుడు ఆ బ్రిటీష్ కాలం లోకి వెళ్లిపోవాలి ... ఒకటి విజువల్స్ తోను .. ఒకటి వాయిస్ ఓవర్ తోను .... అలాగే వెళ్తాము ... బ్రిటీష్ వాడు భారత దేశం లో (లగాన్) పన్నులు వసూలుచేసే వాడు .. అది పండిన పంటలో కొంతబాగంగా .. ..  


చంపనీర్ అనే ఒక గ్రామం .. అక్కడ ప్రజలు ... పరిస్థితులు వివరించి కధ లోకి వస్తారు ....

theme  and struggle : వర్షం మీదే ఆధార పడి పంటలు పండించే వారు ...
వర్షం కుడా తక్కువగా కురుస్తుంది ... అప్పుడు ప్రజలు పంటలు సరిగా పండక అల్లాడుతుంటారు .. ఆకలి బాధలు అటువంటివి ..

setup  conflict between hero and vilan : incident 1


1.భువన్ (అమీర్ ఖాన్) .. కెప్టెన్ రస్సెల్ జింక వేటాడుతూ వుంటే దాన్ని కాపాడుతూ వుంటాడు ... కానీ దొరికి పోతాడు ...

Raise the stakes Incident 2: బ్రిటీష్ వాడికి బలుపు, అధికారం ఉన్నదన్న మదం ... పొగరు అన్నీ వున్నాయి ..


1 .చంపనీర్ ప్రాంత రాజు .. బ్రిటీష్ కెప్టెన్ రస్సెల్ .. ఇచ్చిన విందులో "మాంసం" ముట్టుకోనని అంటాడు .. ఎందుకంటే రాజు -. శాకాహారి .... బ్రిటీష్ వాడు హర్ట్ అవుతాడు ... అంతే .. (లగాన్) పన్ను రెండింతలు చేస్తాడు .....
ఆ విషయం చంపనీర్ లో చాటింపు వేస్తారు ... ప్రజల్లో కోపం పెరుగుతుంది ...

setup  conflict between hero and vilan : incident 2

2..రాజు గారు క్రికెట్ చూస్తున్నారని .. అక్కడకి గ్రామస్తులు + హీరో భువన్ (అమీర్ ఖాన్) కుడా రావడం .. (పన్ను రెండింతలు గురించి అడగాలని వస్తారు.)... బాల్ పట్టుకున్న ఒకరిని బ్రిటీష్ వాడు కొట్ట బోతే ... భువన్ వాడ్ని కొట్టడం ....
ఈ రెండు ఇన్సిడెంట్స్ లో భువన్ కి - కెప్టెన్ రస్సెల్ కి చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది .. అందునా అధికారం వున్నా బ్రిటీష్ వాడు ... పందెం కాస్తాడు ...



plot point 1 : పన్ను ఎత్తి వేస్తాను .. ఈ ప్రాంతానికి అంతా .. మీరు క్రికెట్ లో మమ్మల్ని ఆడి గెలిస్తే .... ఒకవేళ ఓడిపోతే నాలుగింతలు కట్టాలి ... అది కండిషన్ ...

హీరో భువన్ .. ఆక్టివ్ క్యారెక్టర్ కాబట్టి సవాలు లి ప్రతి సవాలు విసురుతాడు (- శరత్ మంజూర్ హై) ...... 3 నెలల తర్వాత క్రికెట్ మ్యాచ్...

procedure starts :

గ్రామస్తులందరికీ భువన్ చెప్పి చూస్తాడు .. ఎవ్వరూ వినరు .... (హీరో కి లక్ష్యం వుంది - సహకారం లేదు - అప్పుడే హీరో మీద సానుభూతి వస్తుంది ...) ఒక్క భువన్ తల్లి, హీరోయిన్ గౌరి వింటారు ...

step 1: ముందుగా క్రికెట్ గురుంచి గ్రామం లో అందరినీ భువన్ - తను చేసిన బాట్ తో .. బాల్ తో చేయడం ... (దీనివలన ఒక పిల్లవాడు, మూగవాడు, గెడ్డం వాడు ... భువన్ చెప్పేది విని .. Batch లో చేరతారు --- 4 మెంబెర్స్ అయ్యారు)


 ఇంతలో వేరే గ్రామస్తులు వచ్చి భువన్ మీద గొడవ ... రాజు దగ్గరికి వెళ్ళడం .. రాజు కుడా .. "ఆట నేర్చుకోండి" అని అంటాడు ...

step 2: 


వీళ్ళు నలుగురు .. దొంగచాటుగా నేర్చుకుందామని ప్రయత్నం .. అది బ్రిటిష్ లేడీ గమనించడం ...
ఆమె వీళ్ళకు పాటలు చెప్పడం ... (ఆట కు బేసిక్స్ వీళ్ళకు తెలియాలి కదా)

step 3:

ఒక పక్క బ్రిటీష్ ఫై అధికారులు కెప్టెన్ రస్సెల్ కి వార్నింగ్ ఇస్తారు ... ఓడిపోతే అఫ్రికాకు వెళ్ళాలి .. ఖర్చు మొత్తం అతని పాకెట్ మనీ లోంచి ఇవ్వాలని ...

తర్వాత ... భువన్ ఒకోక్కరినీ Batch లోగి లాగడం ....

step 4: 

 


పాట ముందు ఆకలి బాధ ద్వారా ఒకరిని (చేలో ఆడిస విసిరే వాడ్ని)
పాట ద్వారా ఒకరిని (హీరోయిన్ గౌరీ ఫాదర్ ని)
పొగడ్తల ద్వారా ఒకరిని (కోళ్ళు పట్టుకునే వాడిని)
పౌరుషం ద్వారా ఒకరిని (బ్రిటీష్ వాడు కొట్టాడని)--- ఈ సీన్ ప్రేక్షకుడు కి కోపం రప్పిస్తుంది...
ఆత్మ విమర్శ ద్వారా ఒకరిని (ముస్లిం అతనిని)
ఇలా తొమ్మిది మంది చేరతారు ..

step 5:

"లాకా" - గౌరీ మీద మనసుపడిన బావ ...
అతను బ్రిటీష్ లేడీ గురించి - కెప్టెన్ రస్సెల్ కి చెప్పడం ...
రస్సెల్ - "లాకా" ని మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం ...

-----------Interval -------------

step 6: లాకా "జట్టులోకి చేరడం .. కానీ భువన్ అతనికి పరీక్ష పెట్టి తీసుకోవడం...


step 7: బ్రిటీష్ లేడీ వచ్చి బాల్ తెచ్చి ఇవ్వడం .... అప్పుడు ఇంకొక ఫాస్ట్ బౌలర్ సింగ్ రావడం ... మొత్తం టీం ఏర్పడటం ... 10 మంది .. ఒక చిన్న పిల్ల వాడు ఎగస్ట్రా ప్లేయర్ ...



step 8: "లాకా" ద్వారా .. కెప్టెన్ రస్సెల్ కి విషయాలు తెలియడం ..బ్రిటీష్ వాళ్ళు కుడా ప్రాక్టీసు స్టార్ట్ చేయడం ...

step 9: క్రికెట్ ప్రాక్టీసు చేస్తున్న భువన్ కి "కచరా" అనే అంటరాని వాడు బాల్ పట్టుకు ని విసరడం ... హీరో ని ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా వుండటం .. వెంటనే హీరో మంచి మాటలతో అందరినీ ఆలోచింపచేయడం ... ఈ స్పిన్ బౌలర్ రాక తో జట్టు పూర్తి అవుతుంది ... 11 మంది వుంటారు ..కచరా ని జట్టులోకి తీసుకోవడం ....

--- ఈ ఒక్క సీన్ సినిమా ను బాగా Elivate చేసింది ..
పాట లో నెట్ ప్రాక్టీసు ...


step 10:


ఫస్ట్ బాటింగ్ టెన్షన్ ... వికెట్స్ తీయడం (హీరో ఓడిపోతాడు - అనేది ప్రేక్షకుడు అనుకోవాలి)
సెకండ్ బాటింగ్ ఇంకా టెన్షన్ .. హీరో ఒక్కడే చివరవరకు వుండి .. సచిన్ టెండుల్కర్ లా గెలిపిస్తాడు ... వికెట్ వికెట్ కు టెన్షన్ .. సెంటిమెంట్ ... అన్నీ రక్తి కడతాయి ..


Main points :

1.క్రికెట్ లో ఎన్ని విషయాలు మనకు తెలుసో .. అన్ని విషయాల ద్వారా సినిమా వుంటుంది .. ఎవరిని ఎవరు అవుట్ చేయాలో కుడా చాలా ప్లాన్ గా చేసుకున్నారు ... చివరికి మ్యాచ్ ఫిక్సింగ్ కూడా...

అసలు క్రికెట్ అంటే తెలియని వాళ్ళు క్రికెట్ బాగా ఆడేవాళ్ళ మీద గెలవడం .. అంటే బలహీనులు బలవంతుల మీద గెలవడం ... ఇది ఇన్నర్ గా జరుగుతుంది ..

2.భారతీయుల్లో హిందూ, ముస్లిం , సింగ్, అంటరానివాడు , కుమ్మరి .. ఇలా అందరినీ ఏకం చేసాడు కాబట్టే ... ఈ స్క్రిప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది ...

3. స్క్రిప్ట్ లో
 
1.Creativity  ఉంది.....

2.Connectivity ఉంది...( భారతీయత ఉంది ....cricket )


3.Sentiment ఉంది (Characters మధ్య వుంటుంది)

4.love   (జనాలకు కావాల్సింది ఉంది )


5.Tension  ,curiosity  ఉంది...


6.Revolution point  (బ్రిటీష్ వారికి వ్యతిరేకం గా పోరాటం ఉంది)............

4.హీరో కి క్రికెట్ లో గెలవడం లక్ష్యం ... ఈ లక్ష్యం కోసం హీరో శ్రమిస్తాడు ... హీరో ఒకోక్కరినీ పోగేస్తూ ... జట్టుల మార్చడానికి కష్టపడతాడు .. ఇబ్బందులు వస్తుంటే ముందు వుండి అందరినీ ఏకం చేసి పోరాడదాం ... అని ఒక నాయకుడి గా జట్టు ని నడిపిస్తాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వికెట్స్ పడేయ్యాలని - ఆలోచించే తెలివయిన కెప్టెన్ లా ఆలోచిస్తాడు ... బాటింగ్ చేస్తూ .. వికెట్స్ పడుతుంటే ప్రతీ బాట్స్ మెన్ కి ఇన్స్పైర్ చేస్తాడు ... బాధ పడతాడు .. చివరికి విజయం సాధిస్తాడు ...
ఇలా కధ లో హీరో లక్షం పడుతూ లేస్తూ .. .. అందుతూ .. దూరం అవుతూ .. వుంటే ... అప్పుడు హీరో ని బాగా ఇష్టపడుతూ ఉంటాము ... అతని లక్షం మనది గా బావించి .. హీరో గెలవాలని కోరుకుంటాము ... ఇదే సక్సెస్ ఫార్ములా ..

Lagaan Inspiration :

ఈ కధ ఇన్స్పిరేషన్ తో మన తెలుగు లో "కబడ్డీ కబడ్డీ" అనే సినిమా వచ్చింది .. ఒక మోస్తరు గా హిట్ అయ్యింది కూడా ... క్లాసిక్ సినిమా లోంచి ఇంకొక సినిమా వస్తుంది .. కానీ ఆ క్లాసిక్ ఇన్స్పిరేషన్ అని తెలియకుండా చూసుకోవాలి ...




0 comments:

Post a Comment