Rangam




మీడియా మీద కమర్షియల్ సినిమా తీస్తున్నారంటే అది కంపల్సరీ గా పాలిటిక్స్ మీదే వుంటుంది .. ఎందుకంటే పెద్ద స్పాన్ వున్నా రంగాలు మూడు ..

1. ఫిలిం ఇండస్ట్రీ

2. స్పోర్ట్స్ ఇండస్ట్రీ

3. పాలిటిక్స్

మొదటి రెండింటి లో గాస్సిప్ లు, బయోగ్రఫీ లు, రియల్ సబ్జక్ట్స్ తీసుకునే ఛాన్స్ వుంది ..
(ది డర్టీ పిక్చర్, పాన్ సింగ్ తోమర్ ... చక్ దే ఇండియా ...)

పాలిటిక్స్ మాత్రం ఎవర్ గ్రీన్ .... ఎప్పుడు వుంటాయి ..

(ఒకే ఒక్కడు, కెమెరా మాన్ గంగ తో రాంబాబు, ఫిర్ భి దిల్ హై హిందూస్థానీ ... రాజ్ నీతి .. ఇద్దరు ..)

మహాభారతం నుండి చూస్తున్నాము కాబట్టి ...

నేటి పరిస్తితులకు తగిన విధం గా మూడు పార్టీ లు వుంటే అటు తమిల్ నాడు లోను ... ఇటు ఆంధ్రా లోను వర్క్ అవుట్ అవుతుంది ...

అదే "రంగం" లో వర్క్ అవుట్ అయ్యింది ..

          ----------ok ----coming to the point ----------------

Script points :

1.కధ లో స్టార్టింగ్, మిడిల్, ఎండ్ పాయింట్ లు తెల్సినప్పుడు ... క్యారెక్టర్ లు .. వాళ్ళ పరిస్తితులు తెల్సినప్పుడు ... కధ కు తగ్గ సీన్ లు వేసుకోవాలి ...

సీన్ లు వేసుకునే ముందు ఫస్ట్ హాఫ్ ని, సెకండ్ హాఫ్ ని విభజించుకోవాలి ..

ఫస్ట్ హాఫ్ లో ఏమి జరగాలి ...?

సెకండ్ హాఫ్ లో ఏమి జరగాలి ...?

ఫస్ట్ హాఫ్ లో

1 ప్రతి పక్ష పార్టీ -. కోట శ్రీనివాసరావు ను - ప్రజల దృష్టిలో నెగటివ్ చేయడం

2 ప్రధాన పార్టీ -. ప్రకాష్ రాజ్ ని - ప్రజల దృష్టిలో నెగటివ్ చేయడం

3 మూడవ పార్టీ -. వసంత్ మీద - ప్రజల కు సానుభూతి కలిగేలా చేయడం

4 ప్రేమ కధ లో ముక్కోణం గా నడచి -. హీరో, హీరోయిన్ లు ఒక్కటి అవ్వడం

 
సెకండ్ హాఫ్ లో

1 బాంబు బ్లాస్ట్ కేసు - లో కీలక విషయాలు

2. ఎన్నికల్లో మూడు పార్టీ ల పోటీ ..

3 మూడవ పార్టీ -. వసంత్ గెలిచినా తర్వాత - హీరో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడం

4. వసంత్ విలన్ అని తెలియడం .. మంచి జరగడం ...

--------------------------------------------------------------------------------

2.సినిమా ఫాస్ట్ గా రన్ అవ్వాలంటే ... కధ లో ఇన్సిడెంట్స్ ఎక్కువ జరగాలి .. అప్పుడు హీరో ఏమి చేస్తాడో? ... అన్న ఉత్సుకత వస్తుంది .. హీరో సక్సెస్ అవుతున్న కొద్దీ ... ప్రేక్షకుడు హీరో పాత్రని ఇష్ట పడుతుంటాడు ....

 ఇన్సిడెంట్ --- దాని వలన ఉపయోగం--- ఏమిటో చూద్దాము ...

Incident 1: బ్యాంకు రాబరీ


1. ప్రేక్షకుడు సినిమాలోకి లీనం అవుతాడు ..
2. సినిమా కధలో హీరో ఫోటో గ్రాఫర్ అని తెలియడం ..... హీరో హీరోయిన్ ల కలయిక.....
3. ప్రీ క్లైమాక్స్ కి లింక్ ...
4. ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? హీరో కి లాక్ వుంది (ప్రేక్షకుడి కి లాక్ లేదు)

Incident 2: పాక మంటల్లో వుంటే వసంత్, అతని మనుషులు ఆర్పడం
 
1. వసంత్ మీద, అతని పార్టీ మీద పాజిటివ్ ఒపీనియన్ ..
2. సెకండ్ హాఫ్ లో లింక్..

Incident 3: కోట శ్రీనివాసరావు - బాల్య వివాహం ఆర్టికల్ వేయడం .. గొడవ ..

 
1. హీరోయిన్ వలన పత్రికకు మచ్చ ఏర్పడింది
2 కోట శ్రీనివాసరావు - ఇమేజ్ పెరుగుతుంది

Incident 4: హీరో కష్టపడి - కోట శ్రీనివాసరావు బాల్య వివాహాన్ని ఫోటో లు తీసి పంపడం
 
1. హీరో హీరోయిన్ కాపాడాడు...
2 హీరో -నేటి వార్త పత్రిక ను కాపాడాడు ...
3. కోట శ్రీనివాస రావు నెగటివ్ అయ్యాడు ...

Incident 5: వసంత్ ని కొందరు కర్రలతో కొట్టడం
 
1. వసంత్ మీద సానుభూతి కలగడం
2. హీరో దాన్ని పత్రికలో వేయమనడం ద్వారా ... వసంత్ హైలైట్ అవ్వడం ..

Incident 6: ప్రకాష్ రాజ్ మీడియా అతన్ని చెప్పు తో కొట్టడం
 
1.హీరో దాన్ని కవర్ చేయడం .. నేటి వార్త కి రేటింగ్స్ పెరగడం ..
2.ప్రకాష్ రాజ్ ప్రజల్లో నెగటివ్ అవ్వడం ...

Incident 7: యువతరం పార్టీ డాక్టర్ .. వడదెబ్బ తగిలిన ఒక కార్యకర్తను కాపాడటం
 
1. వసంత్ పార్టీ కి ప్రజాదరణ పెరగడం...

Incident 8: యువతరం పార్టీ ప్రచారం లో బాంబు బ్లాస్ట్

 
1. కోటశ్రీనివాసరావు చేయించాడనే అనుమానం ... వస్తుంది ...
2. ప్రకాష్ రాజ్ చేయించాడనే అనుమానం ... వస్తుంది ....
3. సెకండ్ హాఫ్ లో లింక్..

Incident Reveal murder : పియా వాజ్ పేయి (సెకండ్ హీరోయిన్) ది మర్డర్ అని రివీల్ ....
 
1. చేసింది ఎవరు? ప్రేక్షకుడు కి, హీరో కి లాక్ ..
2. ఎందుకు ఆ అమ్మాయిని చంపారు?

Incident 10: హీరోయిన్ బ్యాగ్ కోసం ఒక్కడు రావడం .. హీరో ఆ బ్యాగ్ ని లాక్కోవడం ..
 
1 హీరో -. దాని మీద వెలి ముద్రలను టాలి చేయమనడం
2 బ్యాంకు రాబరీ లో వున్న -. "కాశి" ని గుర్తించడం ...
3.ఫస్ట్ హాఫ్ లో వేసుకున్న - బ్యాంకు రాబరీ లో లాక్ ఓపెన్

Incident 11: హీరోయిన్ - హీరో + వసంత్ దిగిన ఫోటో గుర్తించి .. హీరో ని నిలదీయడం

 
1. హీరో .... వసంత్ తో గడిపిన కాలేజీ డేస్ .. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడం ...


Incident 12:నక్సల్స్ ని వసంత్ విడుదల చేస్తున్నాడనే వార్త .. హీరో చూడటం ..
 
1. హీరో వసంత్ దగ్గరకు వెళ్ళడం ... కాశి అక్కడ వుండటం ..
2. కాశి గ్యాంగ్ ని హీరో ఫాలో అవ్వడం ...
3.పాక కాలిపోయినప్పుడు ... కార్యకర్తలు వసంత్ ని కొట్టినప్పుడు ... బాంబు బ్లాస్ట్ ... సెకండ్ హీరోయిన్ మరణం ... అన్ని వసంత్ చేసినవే అని ఒకొక్కటి లాక్ లు ఓపెన్ అవ్వడం
4.క్లైమాక్స్ కి లీడ్ ..


Subplot : మధ్య మధ్య లో హీరోయిన్ - హీరో ట్రాక్ వుంది .. అది నార్మల్ కాబట్టి డిస్కస్ చేయడం లేదు ...


 
ప్లస్ పాయింట్స్

1.     ప్రకాష్ రాజ్ ఒక పక్క ... కోట శ్రీనివాసరావు ఒక పక్క వుంటే .. అనదరి ఆలోచనలు వాల్లిద్దరిమీదే వుంటాయి .. కానీ స్టొరీ చివరికి వచ్చే సరికి వసంత్ - మెయిన్ విలన్ అని తెలియ చేసే స్క్రీన్ ప్లే బాగుంది ...

2.     హీరో ఎవరిని బాగా నమ్ముతాడో - వాడె విలన్ అవుతాడు ... ఇటువంటివి చాల కధలు వున్నాయి .. ఈ థ్రెడ్ థ్రిల్లర్స్ లో పనికి వస్తుంది ... (అభిలాష - చిరంజీవి రావు గోపాలరావుని బాగా నమ్ముతాడు ... అతనే విలన్)

3.     హీరో, హీరోయిన్ లకు ఒక వృత్తి పెట్టి కధ రాసుకుంటున్నారు .. అవి బాగా వర్క్ అవుట్ అవుతాయి .. ప్రేమ కధ కుడా కలిసిపోతుంది .. (ప్రేమ కధ కధ లో బాగం కావలి .. కానీ ప్రేమకదే సినిమా అవ్వకూడదు ..పెద్ద హీరో ల కధల్లో) Example : మన్మథుడు, రోబో, ...

4.     కధ కి ఒక బౌండరీ లైన్ వుంటుంది .. అక్కడే కధ జరగాలి ... ఫస్ట్ హాఫ్ లో వేసుకున్న క్యారెక్టర్ లు .. ఇన్సిడెంట్స్ ... సెటప్ లు అన్ని సెకండ్ హాఫ్ లో ఉపయోగ పడేలా చూసుకుంటూ కధ అల్లుకున్నారు ... స్క్రీన్ ప్లే టైట్ గా చేసుకున్నారు .. ప్రేక్షకుడు విసుగు చెందే ఛాన్స్ ఇవ్వలేదు .... పాటకు పాటకు మధ్య ఇన్సిడెంట్స్ ... రియాక్షన్స్ ఫాస్ట్ గా జరిగేల చేసుకున్నారు ... అందుకే కధ బాగా వచ్చింది ..

Final clue :

స్క్రిప్ట్ - అంటే = పేక ముక్కల బిల్డింగ్ - అనుకున్న కధ లో ఏ సీన్ తీసి వేసినా ... పేక ముక్కల బిల్డింగ్ లోంచి ఒక కార్డు తీస్తే కూలినట్టు గా వుండాలి ...


 

0 comments:

Post a Comment