Thread 6,7&8


Main thread 6 : Replace the person (ఒకరి స్థానం లో కి మరొకరు )

1.హీరో లు ఇద్దరు ఒకేలా వుండి ,ప్లేస్ లు మారతారు ... లేదా 

2.ఒకరి బదులు హీరో ఆ స్థానం లో కి వెళ్లి ఆ కుటుంబం లో మార్పులు జరిగి అనందం గా ఉండేలా చేయడం ...
 
చివరకు ఆ విషయం తెలిసి పోతే ఎం జరుగుతుంది? ఉత్సుకత సినిమా ని రన్ చేస్తుంది. .. ఇవి చాలా సినిమాల్లో వచ్చాయి ... వర్క్ అవుట్ అయ్యాయి ... ముఖ్యం గా డబల్ రోల్ సినిమాల్లో ...

first Example :

రాముడు - భీముడు ... రౌడి అల్లుడు ... హలో బ్రదర్ ... అదుర్స్ ... జీన్స్ ... కొడుకు దిద్దిన కాపురం ...
 
Second  Example :

పెద్దింటల్లుడు ... అతడు (వారసుడొచ్చాడు) .. రుక్మిణి ... పెళ్లి కానుక ...
దీని వలన కామెడీ / టెన్షన్ / చేంజెస్ / రావాలి .. లేక పోతే హీరో ఆ ప్లేస్ కి వెళ్ళడం వేస్ట్ ...




Main Thread 7 : leader -Supporter to common people (పేద వాడికి సపోర్ట్ గా వుండే లీడర్)

పేద వాడు, సామాన్యుడు అన్యాయానికి గురైన పరిస్తితి వివరించి ... వాడికి న్యాయం ఎక్కడా అందాకా పోతే .. అప్పుడు హీరో వచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయడం ... నేనున్నా అని భరోసా ఇవ్వడం ...

ఇది ఒకప్పటి నుండి కొనసాగిన థ్రెడ్ ...

ఫాస్ట్ స్క్రీన్ ప్లే వలన మాత్రమే .. హిట్ కి ఛాన్స్ .. లేక పోతే మూసగా సాగుతుంది ... చివరకు విసుగు పుడుతుంది ..

Example :

సింహా (హనుమంతు) ...భాషా .. గాయం ... సర్కార్ ... శ్రీ రాములయ్య ... అడవి లో అన్న ... అంకుశం ... శివయ్య ....




Main Thread 8 : Bluffing the villains (విల్లన్స్ దగ్గర చేరి వాళ్ళని ఆడుకోవడం )

హీరో తన ప్రేమ కోసమో ... పగ కోసమో ... విలన్స్ దగ్గర చేరి వాళ్ళని .. వాళ్ళ వీక్ నెస్ ల మీద ఆడుకుంటూ హీరో తన లక్ష్యం సాధించడం ... ఇందులో టెన్షన్ / డ్రామా / సెంటిమెంట్ / ఎంటర్టైన్మెంట్ వుండాలి ... అప్పుడే హిట్ అవుతుంది ...

Example : శ్రీను వైట్ల సినిమాలు

డీ .. రెడీ ... దూకుడు ... కింగ్ ... నమో వేంకటేశా ... కందీరీగ ...
దీన్ని సెకండ్ హాఫ్ లో వాడుతున్నారు ....

0 comments:

Post a Comment