Thread 3,4&5



Main Thread 3:

Heroin
problemà Hero solution

(అమ్మాయిల మనసు గెలుచుకోవడం)
హీరోయిన్ కి సమస్య వుంటుంది .. లేదా లక్ష్యం వుంటుంది ... దాన్ని సాధించడమే హీరో పని ... ఇలాంటి కధలుకుడా వచ్చాయి ..

మహిళా ప్రేక్షకులను గెలుచుకోవడం కోసం ఈ థ్రెడ్ వాడుతున్నారు .. ఇది కొంత వరకు .. కొన్ని సినిమాలకు పని చేస్తుంది ... పదే పదే ఇలాంటి సినిమాలే వస్తుంటే .. హీరో కి పనీ పాట ... లేదనుకునే ప్రమాదం వుంది ...

Example :

ఒక్కడు ... సింహాద్రి .. బాలు .. గుడుంబా శంకర్ .. ఆర్య

భద్ర .. మహానంది .. పౌర్ణమి (స్వర్ణ కమలం)... బంగారం ... శుభాకాంక్షలు ...
 
Suggestion :

ఫై వాటిలో మూడు హిట్స్ వున్నాయి ... ఒక్కడు, సింహాద్రి .. ఆర్య..
మూడింటిలో 

ఫస్ట్  ఒక్కడు- హీరో కి కుడా లక్ష్యం వుంటుంది ..
సెకండ్  సింహాద్రి - హీరో క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుంది ...
థర్డ్...ఆర్య - స్వచ్చ మయిన ప్రేమ, క్రియేటివిటీ వుంది ..
 అందువలనే బాగా హిట్ అయ్యాయి ..



Main Thread 4: Common man Revolt (సామాన్యుడు తిరగబడితే

సామాన్యం గా బ్రతికే వాడికి సమాజ పరిస్తితుల వలన ఇబ్బంది, బాధ కలిగితే .. అతను తిరగబడితే ...? ఎందుకు తిరగబడ్డాడు? ... అతని గతం ఏమిటి? ఇవే కమర్షియల్ కధలు .. శంకర తీసే కధలు ...

Example :

జెంటిల్ మాన్ ... భారతీయుడు ... అపరిచితుడు ... ఒకే ఒక్కడు ... టాగోర్ ... (మురుగదాస్ "రమణ") .... వెడ్నాస్ డే (ఈనాడు) ... గణేష్ ...

ఈ కధల్లో ఫ్లాష్ బ్యాక్ చాలా పెయిన్ ఫుల్ గా వుండాలి ... హీరో చేసింది కరెక్ట్ అనిపించేలా వుండాలి ... లేక పోతే పాయింట్ మింగుడు పడదు ...

అసలు పర్సనల్ గా హీరో ప్రాబ్లం ఫేస్ చేయకుండా .. మంచి చెబుతాం .. చేస్తాం .. అంటే ఎవరు స్పందించరు ...

Example :

లీడర్ .. శివాజీ ... హీరో ఇందులో పర్సనల్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా .. మంచి చేయడం నప్పలేదు ...
ఈ కధలకు ఎప్పుడూ గిరాకీ వుంటుంది ... కానీ బ్యాక్ డ్రాప్, క్రియేటివిటీ, లాజిక్ అన్నీ బాగుండేలా చూసుకోవాలి ..


Main Thread 5: Common woman Revolt (సామాన్యురాలు తిరగబడితే

అతి సాధారణ స్త్రీ .. సంఘం లో అభాసు పాలయి .. ప్రేక్షకుల సానుభూతి పొంది .. చివరకు విలన్ మీద తిరగబడితే .... ప్రేక్షకులు జేజేలు పలుకుతారు ..

అయితే సానుభూతి పొందే క్రమం లో విసిగించకూడదు ... చివర్లో జరిగే యుద్ధం కోసం .. ప్రేక్షకుడు విసిగి పోతే .. సినిమా నిలవదు ...

Example :

తలంబ్రాలు ... అరుంధతి .. ప్రతి ఘటన .. కర్తవ్యం ... ఆమె ... అవును .. మనోహరం. అంతఃపురం ..., అమ్మోరు ...

ఒక క్రమం లో స్క్రీన్ ప్లే, సీన్ లు టెన్షన్ పెట్టిస్తూ .. సాగి .. అది ప్రీ క్లైమాక్స్ కు పరాకాష్ట కు చేరుతుంది .. క్లైమాక్స్ లో రణరంగం జరగాలి ... అలా జరిగిన కధలు సూపర్ హిట్స్ అవుతాయి ...
ఇందులో విసిగి పోయిన కధ ..  

Example : ఆరుగురు ప్రతివ్రతలు ...

0 comments:

Post a Comment