Article-8





Article-8

సినిమా ని ఏవిధం గా చూడాలి? ఏ విధం గా ఎనాలిసిస్ చేయాలి? చూసి ఎంత వరకు నేర్చుకోగలం

Observation is a Great Teacher 

మనం ఎంత లోతుగా అర్ధం చేసుకుంటే అంత నాలెడ్జి వస్తుంది ..
Step 1: మొదట పూర్తిగా ప్రేక్షకుడి లా సినిమా ను చూడాలి ... (మీలో విమర్శకుడు వుంటే వాడ్ని కాస్త ఆపండి) సినిమా ను ఎంజాయ్ చేయండి .

Script work: preproduction




సినిమా  స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే నాలెడ్జి కి సంబంధించిన వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి....

Step 2: ఒక రైటర్ గా ఆలోచించండి .. ఈ సినిమా కధ ఏమిటి? కధ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎక్కడ మలుపు తిరిగింది? ఎవడి వల్ల మలుపు తిరిగింది? హీరో లక్ష్యం ఏమిటి? అది సాధించాడా? లేదా? అని పూర్తిగా కధ గురించే ఆలోచించండి ...

Step 3: క్యారెక్టర్ ల గురించి ఆలోచించండి ... క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేసారు? హీరో క్యారెక్టర్ ఎలా వుంది? హీరోయిన్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, హీరో కి సపోర్ట్ చేసే క్యారెక్టర్ లు ... ప్రేక్షకుడి తరుపున వుండే క్యారెక్టర్ లు ... క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా వుంది? హీరో క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా వుంది? ఇలా అన్ని రకాలు గా క్యారెక్టర్ ల గురించి స్టడీ చేయండి ... క్యారెక్టర్ స్టార్టింగ్ - ఎండింగ్ లు కుడా చూడాలి ... కధ కు క్యారెక్టర్ ఎంత వరకు వుపయోగపడిందో కుడా తెలియాలి ...

Step 4: స్క్రిప్ట్ పాయింట్స్ చూడండి .... ప్లాట్ పాయింట్ -1 ఎక్కడ? ప్లాట్ పాయింట్ -2 ఎక్కడ? మెయిన్ ప్లాట్ ఏమిటి? సబ్ ప్లాట్ ఏమిటి? టర్నింగ్ లు ఏమిటి? ట్విస్ట్ లు ఏమిటి? ఇలా స్క్రిప్ట్ పరం గా చూడండి…plantings and payoffs, plot devices, time locks, option locks  ఇలా అన్నీ గమనించండి

Step 5: సీన్ లు ఎలా వేసారు? సీన్ అలా వెయ్యడానికి కారణం - కధ ... ఆ కధ ప్రకారమే సీన్ లు వుండాలి ... సీన్ - టు - సీన్ ఎలా లింక్ కలుపుతున్నారు? నెక్స్ట్ సీన్ కి ఎలా వెళ్తున్నారు ... సీన్ లో ఇన్సిడెంట్స్ ఎలా సృష్టించారు ... ఆక్షన్ -? రియాక్షన్ లు ఎలా పెట్టారు ...? సీన్ లో ఏ ఫీల్ క్యారీ అయ్యింది? .... ఇవన్నీ సీన్ లు చూసే టప్పుడు గమనించాలి ..
టెన్షన్, కామెడీ, Curiosity , సెంటిమెంట్, ఆక్షన్ ఎలా స్క్రిప్ట్ లో పెట్టారో గమనించండి ...

Making work: production work 

Step 6: Camera work: ఫస్ట్ సీన్ నుండి చివరి సీన్ వరకు వున్నా ప్రతీ షాట్ గమనించండి .. ఒకే రోజు వీలు కాకపోతే రోజుకి ఒక సీన్ చూడండి (కోడి రామ కృష్ణ గారు ఒక్క సీన్ అయినా రోజూ చుస్తాడట) కెమెరా ఎక్కడ పెట్టారు / షాట్ టైపు ఏమిటి? ఎందుకు పెట్టారు? ... ఇవన్నీ చూడాలంటే సినిమా ని మ్యూట్ లో పెట్టండి ...
సీన్ ని పడే పడే చూడండి .. షాట్ డివిజన్ మీకు అర్ధం అవుతుంది .. వచ్చేస్తుంది ...

Step 7:Direction : ఒక సీన్ ను డైరెక్టర్ ఎలా డైరెక్ట్ చేసాడు? ఆర్టిస్ట్ లకు ఎలా ఎక్ష్ప్లైన్ చేసాడు? ఎలా సెంటిమెంట్ పందిచాలో ఎలా వివరించాడో మీరు ఆ ప్లేస్ లో వుంది ఊహించండి ... మేరె డైరెక్టర్ గా ఊహించుకోండి .... మీ బాడీ మూవ్మెంట్ అలాగే సెట్ లో వుండాలి కదా .. ఎందుకంటే ఒక 200 మంది మిమ్మల్ని చూస్తూ వుంటారు .. మీరు ఏమాత్రం ఫీల్, సిగ్గు పడకుండా - స్క్రిప్ట్ పేపర్ ని క్లియర్ గా అందరికీ చెప్పాలి ... అవుట్ పుట్ రప్పించుకోవాలి ..
1 షాట్ ఎలా .. నెక్స్ట్ షాట్ ని ఎలా డైరెక్ట్ చేసారో ఊహించండి ..
నాకు షాట్ ఇలా రావాలి - అని కరాకండీ గా చెప్పగల్గిన వాడే డైరెక్టర్ ..
(రామ్ గోపాల్ వర్మ - చుసిన సినిమా ను మళ్ళీ మళ్ళీ చూసి దిరెచ్తిఒన్ నేర్చుకున్నాడు)

After making: Post Production 

Step 8: Editing : తీసిన సీన్ లలో షాట్స్ ను ఎలా కలిపారు ... ఎంత బాగా ఫీల్ వచ్చేలా కలిపారు ... ఎలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చారు ... అనేది గమనించాలి ...
ఎడిటెడ్ స్క్రిప్ట్ వుంటే ఇవన్నీ సాధ్యం .. అంటే స్క్రిప్ట్ ని ముందుగానే ఎడిటింగ్ చేసుకుని చూసే స్క్రిప్ట్ .. అందులో అనవసరపు షాట్స్ వుండవు ... కట్ టు కట్ వుంటుంది ....

Step 9: Dubbing: కొన్ని సినిమాలు షాట్స్ తీసినప్పుడు అక్కడ ఏమి ఉండక పోవచ్చు .. కానీ డబ్బింగ్ లో వాయిస్ కలుపుతారు ... అప్పుడు ఎఫెక్ట్ వస్తుంది ... (అరుంధతి లో బిల్డింగ్ మాట్లాడటం లాంటిది) .... కొందరు డబ్బింగ్ లో గొంతు మారుస్తారు ... (కొండవలస - ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లో) ... ఇలా మార్పులు గమనించాలి ...

Step 10: Background score, sound effects సీన్ ని మ్యూజిక్ తో, సౌండ్ ఎఫెక్ట్ తో ఎలా హై లైట్ చేస్తున్నారో గమనిచండి .. కేవలం చెవులకే పని పెట్టండి .. (హ్యాపీ డేస్ -. మ్యూట్ లో పెట్టి కాసేపు చూడండి .. ఏ ఫీల్ కలగదు)…. శబ్దం ఎక్కడ వాడాలి? ఎక్కడ ఎంత వుండాలి? అసలు ఉండకుండా వుంటే .. ఇలాంటి ఆలోచనలు ముందుగానే మనకు రావాలంటే ... జాగర్త గా గమనించాలి ...

Promotion : టైటిల్ ఎలా డిజైన్ చేసారు? కధ కు సరిపోయిందా? ఎంత క్రియేటివిటీ గా చేసారు? పోస్టర్ డిజైన్ ఎలా వుంది? అని ఫైనల్ గా గమించాలి ... దీనితో సినిమా సరిగ్గా చూడడం పూర్తి అవుతుంది ...

Final గా 

Creativity ఒకడి సొత్తు కాదు ...
 
Direction బ్రహ్మ విద్య కాదు ...

మైండ్ పెట్టి, మేనేజ్ చేయగలిగే Marketing Job
సబ్జెక్టు ని కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చే Doctor Job
స్టొరీ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా డిజైన్ చేసే Engineer Job
పర్ఫెక్ట్ కోడింగ్ వున్న పొగ్రమ్స్ రాసే Software job ...
కూలీ లందరినీ ఒకే తాటి పైకి తెచ్చే మేస్త్రి --- Director  ...

0 comments:

Post a Comment